స్వేచ్ఛ

స్వేచ్ఛనువ్వు ఎంచుకున్న దారి కొత్తదైనప్పుడు
నీ గమ్యం దూరమైనపుడు
చుట్టూ వెక్కిరింతలే చేరుతాయి
అయినా ఎవరో అవమానించారని
నువ్వు ఆగిపోకు
ఎందుకంటే మంచి జరగకపోతే
ఆ దైవాన్ని సైతం దూషించే ఈ సమాజానికి
నిన్ను హేళన చేయడం ఓ లెక్కనా
మార్కుల కోసం యుద్ధం చేయాలి.
జాబుల కోసం యుద్ధం చేయాలి.
డబ్బుల కోసం యుద్ధం చేయాలి.
ఇందులో గెలిచినోడిని మహాత్ముడంటారు.
మనసుకు నచ్చింది చేసేవాడిని మూర్కుడంటారు
అయినా డబ్బు ఉన్నోడే మహాత్ముడైతే
నేడు పచ్చనోటు మీద ఆ మహాత్ముడు ఉండేనా….
నీ ఊహల్లో నువ్వో పక్షివేమో
కానీ నిజజీవితంలో నువ్వొక
బందిఖానాలో ఉన్న ఖైదీవి
పైకి ఎగరాలి అనే ఆశలు నీకుంటే
రెక్కలు విరిచే కష్టాలు కూడా వెంటాడుతాయి.
నీ జీవితాన్ని పక్కనోడి జీతంతో
పోల్చుతున్నారని బాధపడకు
ఎవరికి తెలుసు నీలో ఓ చలం ఉన్నాడేమో
ఎవరు ఊహించగలరు నువ్వే మరో కలాం అవుతావేమో…..
– రమేష్‌ మాండ్ర, 8555929026