– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్యాంకుబండ్‌పై గద్దర్ విగ్రహాన్ని ప్రతిష్టింపచేయాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సొంత ఊరు తూప్రాన్‌లో స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్.. గద్దర్‌కి అపాయింట్ మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలికి పిలవక పోవటంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ కుటుంబ సభ్యులకు కేసీఅర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల మంది గుండెల్లో ఆయన ఇంకా బతికే ఉన్నాడనీ, అందుకే ఆయనకు మరణం లేదని తెలిపారు.