నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా గాయకుడు గద్దర్ మతి విచారకరం. సమ సమాజం కోసం తపిస్తూ చివరి శ్వాస వరకు పోరాడారు. పీడిత, తాళిత వర్గాలకు, పేద ప్రజల హక్కుల సాధనకు చివరి శ్వాస వరకు ఉద్యమించారు. గద్దరన్న మతి అందరికి లోటు. తెలంగాణ ప్రజల గోస, యాస, ధిక్కార అస్తిత్వాన్ని తన వాణితో ప్రస్ఫుటంగా ప్రపంచానికి వినిపించిన విప్లవకారుడు గద్దర్.
తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉంటాడు
టీపీసీసీ ఉపాధ్యక్షురాల బండ్రు శోభారాణి
ప్రజాయుద్ధనౌక గద్దర్ తెలుగు ప్రజల హృదయాల్లో తన ఆట, తన పాట, తన శైలితో శాశ్వతస్థానం ఉంటుంది.తెలంగాణ యాస, భాష, సంస్కృతితో రచనలు చేశారు. ప్రజల్లోకి చొచ్చుకుపోవడం ఆయన ప్రత్యేకత. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దసంఖ్యలో కళారూపాలు, కళాకారుల ఆవిర్భావానికి ఆయనే స్ఫూర్తి. అందుకే గద్దరన్న ప్రజాకవి, ప్రజాకళాకారుడయ్యాడు. ఆయనకు నివాళి.
తీరనిలోటు :మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
గద్దర్ మృతి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ఆయన చనిపోవడం బాధాకరం. తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన గద్దర్, జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు. ఆయనకు నివాళి. కుటుంబానికి సానుభూతి.
ప్రజాగొంతుక మూగబోయింది టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ
ప్రజాయుద్ధకౌక, ప్రజాగొంతుక గద్దర్ చనిపోవడం బాధాకరమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య తెలిపారు. ఆయనో ఉద్యమ కెరటమని వ్యాఖ్యానించారు. తన పాటతో ప్రపంచాన్ని మేల్కోలిపారని చెప్పారు. అందుకే ఆయన ప్రజాగాయకుడయ్యారు. నిరంతరం ప్రజల మేలు కోరుకున్నాడన్నారు.