ఎంఆర్పి ధరలతో నాణ్యమైన విత్తనాలు ఎరువులు పొందండి: కోఆర్డినేటర్

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో రైతులు సభ్యులుగా చేరండి. ఎమ్మార్పీ ధరలతో నాణ్యమైన ఎరువులు విత్తనాలు పొందండి. అంటూ ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు చెందిన కోఆర్డినేటర్ వ్యవసాయ రైతులను కోరారు. ఇరువురు కోఆర్డినేటర్లు గురువారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో గల రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన నవ తెలంగాణ విలేకరులతో మాట్లాడుతూ మద్నూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ 39 లక్షల 55000 సీడ్స్ టర్నోవర్ చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఎంతో ఉపయోగపడుతుందని రైతులంతా సభ్యులుగా చేరి కంపెనీ అభివృద్ధికి అలాగే ఎంఆర్పి ధరలకే లభించే విత్తనాలు ఎరువులను పొందవచ్చని వారు తెలిపారు. ఇప్పటివరకు మద్నూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో దాదాపు 500 మంది వరకు రైతులు సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది. మద్నూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రైతుల కోసం సీడ్స్ అందించడం జరిగిందని కంపెనీ నడవడికలపై ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ చైర్మన్ కంపెనీ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.