నవతెలంగాణ-చిట్యాల
చెట్టుకు ఉరేసుకుని గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గురువారం జరిగింది.చిట్యాల ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు సత్తయ్య (63) మద్యా నికి బానిసయ్యాడు.ఈ క్రమంలో మద్యం సేవించడానికి డబ్బులు లేక.. మనస్తాపం చెంది గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో వేప చెట్టు కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.