బ్రేక్‌ ఇవ్వాల్సిందే…

Give a break...ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో 400 కోట్ల మంది ప్రజలు రోజుకు సుమారుగా 144 నిమిషాలు గడిపేస్తున్నారట. సోషల్‌ మీడియా ప్రత్యేకతే అది మరి. రకరకాల విషయాలతో ఆకట్టుకుంటూ… ఏదో ఒక అప్‌డేట్‌, లింక్‌ పంపుతూ మనకు సమయమే తెలియకుండా చేస్తుంది. దీంతో మనకు తెలియకుండానే సోషల్‌ మీడియా అడిక్ట్స్‌ అయిపోతాము. గంటల తరబడి ఆ సైట్లతోనే గడిచిపోతుంది. అందుకే ఇలాంటి సైట్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైట్లు, యాప్స్‌ నుంచి ఒక్కసారి బ్రేక్‌ తీసుకంటే మీకే తేడా తెలుస్తుంది. ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు అని నిపుణులు చెబుతున్నారు.
– సోషల్‌ మీడియాతో కొంతవరకు మానసి కంగా తోడు దొరుకుతుంది. ఒంటరితనం, భయా లు పోతాయి. వర్చువల్‌ వరల్డ్‌లో తోడు దొరికితే… ఆనందపడే వారు చాలామంది ఉన్నారు. అది ఆరో గ్యానికి మంచిదే. తోడు దొరికిందన్న సంతోషంతో మానసికంగా మరింత బలవంతులుగా మారు తారు. కానీ సోషల్‌ ఐసోలేషన్‌తో ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. దీంతో చాలా దుష్పరిణా మాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవ రైనా అన్‌ఫాలో చేసినా, సోషల్‌ మీడియాలో క్లోజ్‌ అయిన వారు దూరం పెట్టినా మానసిక ఆందోళన బాగా పెరిగిపోతుంది. సోషల్‌ మీడియా నుంచి కొంతకాలంపాటు బ్రేక్‌ తీసుకోవడంతో వీటిని జయించవచ్చు అంటున్నారు నిపుణులు.
– సైబర్‌ సమస్యలు ఎదుర్కోని సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఒక్కరు కూడా లేరు. అన్ని వయసుల వారు ఎప్పుడోకప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇతరులతో రోజూ పోలికలు పెట్టి విమర్శించడం ఓ అలవాటుగా మా రిన నేటి రోజుల్లో సైబర్‌ బుల్లియింగ్‌ విపరీతంగా మారింది. దీనివల్ల మానసికంగా కుంగుబాటు చెందు తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
– గంటల తరబడి కూర్చోవడం అంటే బద్దంకం పెరిగినట్టే. దీంతో శారీరక సమస్యలు కూడా వస్తాయి. పైగా వర్చువల్‌ వరల్డ్‌లోనే గడి పేందుకు మీరు ఇష్టపడుతూ రియల్‌ వరల్డ్‌కు దూరంగా ఉండిపోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. డైరెక్టుగా కలవటం ఎందుకు హ్యాపీగా లైవ్‌లో మాట్లాడుకోవచ్చు కదా అనుకుంటారు. ఈ ఆలో చనా ధోరణితో మీరు అధిక ఒత్తిడి, అందోళనకు లోనవుతారు. అందుకే అప్పుడప్పుడూ డీటాక్స్‌ అవ సరం. ఎప్పుడు బ్రేక్‌ తీసుకోవాలో మీరే గుర్తించి, ఓ పద్ధతి ప్రకారం తరచూ సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకోవడం ఉత్తమం.