– బీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు
నవతెలంగాణ-ముదిగొండ
మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్‌రాజు ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా మండల పరిధిలో వల్లాపురం, అమ్మపేట, వనంవారికిష్టాపురం, ముత్తారం, పండేగుపల్లి, ఖానాపురం, న్యూలక్ష్మీపురం, సువర్ణాపురం, ముదిగొండ, వెంకటాపురం గ్రామాల్లో మంగళవారం లింగాల ప్రచారం విస్తృతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అండగా నిలబడి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి ప్రజలకు దూరంగా హైదరాబాదులో ఉంటూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. స్థానికంగా ఉన్న తనను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ రూపురేఖలను మారుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన కొండబాల కోటేశ్వరరావు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు సంబాని చంద్రశేఖర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పిటిసి సభ్యులు పసుపులేటి దుర్గవెంకట్, నాయకులు నారపొంగు కిరణ్ కుమార్, ఆడపా నాగేందర్, బంక మల్లయ్య, పచ్చా సీతారామయ్య, పాము సిల్వరాజు, పండ్రేగుపల్లి, ఖానాపురం, వెంకటాపురం, వల్లాపురం, ముదిగొండ గ్రామ సర్పంచు పాల్గొన్నారు.