నవతెలంగాణ-మధిర
మధిర ఎమ్మెల్యేగా ఒక అవకాశాన్ని ఇస్తే మీ సేవకుడిగా పని చేస్తానని, అందుబాటులో ఉండే నాయకుడు కావాలో హైదరాబాదులో ఉండే నాయకుడు కావాలో ఒక్క నిమిషం ఆలోచించు కోవాలని నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు అన్నారు. మధిర పట్టణ పరిధిలో ఆయన శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు.