క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన జీఎం

నవతెలంగాణ-ఇల్లందు
వర్క్‌ పీపుల్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోషియేషన్‌ ఇల్లందు ఏరియా అధ్వర్యంలో స్థానిక 24 ఏరియా గ్రౌండ్‌ నందు 2023-24 సంవత్సరానికి గాను గనులు, విభాగాల స్థాయి క్రికెట్‌ పోటీలను ఆదివారం ఏరియా జనరల్‌ మేనేజర్‌ జాన్‌ ఆనంద్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా క్రికెట్‌ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది సింగరేణి సంస్థ ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని, ప్రతి క్రీడాకారుడు ఉద్యోగం తోపాటు ఆటలలో పాల్గొని తమలోని ప్రతిభను చాటాలని అలాగే క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జిఎం మల్లారపు మల్లయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాసు, డీజీఎం (పర్సనల్‌) జి.మోహన్‌ రావు, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, క్వాలిటీ మేనేజర్‌ యూసఫ్‌, సీనియర్‌ పర్సనల్‌ అధికారి సాయి స్వరూప్‌, క్రీడా సమన్వయ కర్త బాలాజీ పాల్గొన్నారు.