– తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
– వికారాబాద్ కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
– జాతీయ జెండా ఆవిష్కరించిన వినోద్‌కుమార్ పాల్గొన్న కలెక్టర్ నారాయణరెడ్డి
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వినోద్‌కుమార్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వం లో సంక్షేమ పథకాలు అమలుపరిస్తూ దేశానికె తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి పోవడం గర్వకారణమన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి 9 ఏండ్లలో జరిగిందని, దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలుస్తుంద,కరువు కటకలతో అలమటించిన తెలంగాణ నేడు సస్యశ్యామలం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో రైతుబంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిందని, రానున్న రోజుల్లో తెలంగాణను దేశం లోనే అగ్రగామిగా నిలిచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. 20రోజుల పాటు నిర్వహించే దశాబ్ది వేడుకలకలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యా ర్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరిం చాయి. ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యేలు ఆనంద్, మహే ష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు సుభప్రద్ పటేల్, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.