
నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం ను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ ఆకస్మికంగా సోమవారం సందర్శించారు. గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం లో పదోతరగతి ఫలితాల్లో మొత్తం 29 మంది విద్యార్థులకు గాను 9మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని సమావేశంలో నవతెలంగాణ విలేకరి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అరోజు ఎంపీపీ గద్దె భూమన్న,ఇతర సర్పంచులు ఎంపిటిసిలు కలిసి ఉపాద్యాయులను నియమించే విధంగా చూడాలని కోరుతు ఏకగ్రీవంగా తిర్మనించి కలెక్టర్ కు పంపారు. ఇదే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు చదువులు చేప్పే వారు లేకపోవడంతో, దాదాపు మొత్తం విద్యార్థులు గణితంలోనే ఫేర్ అయ్యారని, కోన్నేళ్ళుగా ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన బోధించే వారు లేక పోవడంతో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.దానిలో బాగంగా ప్రైమరీ స్కూల్ టీచర్ ( సోషల్ సబ్జెక్టు కోసం )ను నియామకం చేసినట్లు విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ వివరించారు. ఇదే కాకుండా గణితం టీచర్ తాత్కాలికంగా నియామకం చేశామని, వారానికి మూడు రోజులు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల లో, మరో మూడు రోజులు పని చేసే చోట బోధన చేసే విధంగా డిప్యటేషన్ వేయడం జరిగిందని, అధ్యాపకులు మంచి విద్యా బోధన చేయించే విధంగా చూడాలని విద్యా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ వివరించారు.అయన వేంట మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాం, తోపాటు అధ్యాపకులు, స్థానికులు ఉన్నారు.