డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ అధ్యాపకుల వినతి పత్రం అందజేత..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రం లోని 12 యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్తాహరి అధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు ప్రముఖ స్థానం ఇస్తూ తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య కారకులుగా నిలిచారని, ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ అనే పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పేరు పెట్టడం గర్వకారణంగా నిలిచారన్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ లేని కాంస్య విగ్రహాన్ని 125 అడుగుల ప్రతిష్టాపించటం జరిగిందని, అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని, విద్యా విధానంలో మార్పు, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆరోజు రాజ్యాంగంలో రాసినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకీభవిస్తూ మా కాంట్రాక్టు ఉపాధ్యాయులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అధికారులు కాంట్రాక్ట్ అధ్యాపకుల ఫైల్ ను పక్కన పెట్టించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్రంలోనూ 12 యూనివర్సిటీ లలో పనిచేస్తున్న 1335 మంది కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్తాహరి తెలిపారు.యూనివర్సిటీ లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను త్రీ మెన్ కమిటీ ద్వారా నియమకం జరిగి గత 15 నుండి 20 ఏళ్ళ నుండి అన్ని అర్హతలు ఉండి చాలీచాలని వేతానాలు పోందుతు కుటుంబాలను పోషించుకుంటు న్నామని వివరించారు. అటెండర్ నుండి డిగ్రీ కళాశాల అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ యూనివర్సిటీల కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను సవితి తల్లి ప్రేమ కనబరుస్తూ మపై నిర్లక్ష్యం చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ ఫలాలను అందరికీ అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి అంబేద్కర్ సాక్షిగా కాంట్రాక్ట్ అధ్యాపకుల ను రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలని ఆల్ యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులు సంఘం రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ వి దత్త హరి కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జోష్ణ ,డాక్టర్ అపర్ణ ,డాక్టర్ రమ్య, డాక్టర్ గోపి రాజ్, డాక్టర్ జలంధర్, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ సురేష్, డాక్టర్ శరత్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రామలింగం, డాక్టర్ జి శ్రీనివాస్, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ మోహన్, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ డానియల్, డాక్టర్ స్వామి, ఈ గంగా కిషన్ పాల్గొన్నారు.

Spread the love