ఆంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని దేవా నగర్ క్యాంపు గ్రామానికి చెందిన ఒక యువకుడు మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని నగ్ పుర్ గేట్ బ్రిడ్జి వద్ద కంటైనర్ డీ కోని అక్కడికక్కడే మృతిచెందిన బిటెక్ విద్యార్థి అభిషేక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పాల్గొన్నారు.మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయినా వేంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, పిసిసి డెలిగేట్ శ్యాంసన్, డిసిసి డెలిగేట్ వాసు, డిసిసి డెలిగేట్ ధర్మ గౌడ్ , సాయి రెడ్డి, రాజన్న, ఇబ్రహీం, లింగం, వినోద్, సురేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అంత్యక్రియల్లో పాల్గొని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

Spread the love