నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలి

నవతెలంగాణ-శంకరపల్లి
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని శంకర్పల్లి సేవ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ నరేష్‌ కుమార్‌ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్బంగా శంకర్‌ పల్లి మండలం అంతప్పగూడ గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున బ్రహ్మానంద ఆశ్రమంలో ఉన్న ఆవులకు పూజ కార్యక్రమాలు నిర్వహించి సేవాఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళ రైతు లక్ష్మికి సన్మానం చేయడం జరిగింది. అలాగే ఆలయ ధర్మకర్త ఏ.నర్సింహా గౌడ్‌ ఆ గ్రామానికి చెందిన రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం పట్ల కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం మంచి నాణ్యమైన విత్తనాలు , ఎరువులను అందించి , రైతులకు సహాయ పడాలని కోరారు. రాత్రి, పగలు కష్టపడి పనిచేసే అన్నదాత రైతులకు మనమందరం అండగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. రైతులు కష్టపడితే గాని మన కడుపులోకి అన్నం ముద్ద వెళ్ళదని నిజాన్ని ప్రతిఒక్క వ్యక్తి అనుక్షణం గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సేవా ఫౌండేషన్‌ జనరల్‌ సెక్రటరీ వి. వెనేంద్ర చారి, సభ్యులు భాస్కర్‌ రెడ్డి, శేఖర్‌ చారి, విద్యార్థులు పెద్దలు పాల్గొన్నారు.