డిఎస్‌ గ్రూప్‌ చేతికి గుడ్‌ స్టఫ్‌

న్యూఢిల్లీ : గుడ్‌ స్టఫ్‌నకు చెందిన ద లవ్‌ఇట్‌ చాక్లెట్‌ అండ్‌ కన్ఫెక్షనరీ బ్రాండ్లను ధరమ్‌పాల్‌ సత్యపాల్‌ గ్రూప్‌ (డిఎస్‌ గ్రూప్‌) సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ద గుడ్‌ స్టఫ్‌ సంస్థకు లవ్‌ ఇట్‌ చాక్లెట్‌ అండ్‌ కన్ఫెక్షనరీ ఉంది. గతంలో ఇది గోల్డ్‌ మ్యాన్‌ సాచ్స్‌, మిట్సుయు వెంచర్స్‌ ఆధ్వర్యంలో ఉంది. డిఎస్‌ గ్రూప్‌నకు సంబంధించిన కన్ఫెక్షనరీ పోర్ట్‌ ఫోలియోలో మరింత వృద్థిని సాధించే వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగా దీన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొంది.