ఆలూతో మేలు

Good with potatoesఆహారపు అలవాట్లలో తేడా నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోవడం సహజం. అలాగే రసాయనాలు కలిపిన షాంపులు వాడటం ద్వారా కేశాలకు ముప్పు తప్పదు. అయితే ఆలూ రసంతో కేశాలను సంరక్షించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
కేశాల సంరక్షణకు ఇది మెరుగ్గా పని చేస్తుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆలూ రసాన్ని మాడుకు పట్టించి మసాజ్‌ చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఆలును శుభ్రం చేసుకుని తురుముకోవాలి. తర్వాత ఆ తురుమును మిక్సీలో రుబ్బుకుని వడగట్టు కోవాలి. ఆ జ్యూస్‌కు మాడుకు పట్టిస్తే జుట్టుకు మంచిది.
ఆలూ రసాన్ని, నిమ్మరసాన్ని చేర్చి మాడుకు రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మాడుపై తేమ నిలుస్తుంది. జుట్టు రాలే సమస్య వుండదు.
ఆలూ రసాన్ని 15 నిమిషాల పాటు మాడుకు పట్టించి మసాజ్‌ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది.