నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను అటు సామాజిక వివక్ష నుంచి దూరం చేయడంతోపాటు, ఇటు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. దళితబంధు, షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి, ఆర్థిక చేయూత పథకం,ఎస్సీ హాస్టళ్ళు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు,ఎస్సీ, ఎస్టీ, గౌడలకు మద్యం దుకాణాల కేటాయింపు, టీఎస్ – ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ ప్రెన్యూయర్స్), ఎస్సీ లకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పలు సంక్షేమ, అభివద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఎస్సీలకు విద్య , ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, ఎస్సీ డిగ్రీ కాలేజీలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు, స్టడీ సర్కిళ్ళు, ఎస్సీ యువత కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.