ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు చెల్లించాలి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్‌ రెడ్డి
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-యాచారం
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం యాచారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు సంఘం, వ్యవ సాయ కార్మిక సంఘం, కెవీపీఎస్‌, గొర్ల కాపరుల సంఘం, సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల ఆధ్వ ర్యంలో ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహించాయి. అనం తరం డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌కు ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు అందక అనేకమంది పేదలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఇస్తానన్న దళిత, బీసీ బంధు పథకాలు అమలు చేయకుండా వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో పేద ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై సర్వే చేసినట్టు గుర్తుచేశారు. ఉపాధి హామీ చట్టం కింద కూలీలందరూ 5, 6 వారాలు పనిచేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దళిత బంధు పథకం కింద అమలైన దళితబంధు అధికార పార్టీ వాళ్లకే అందించారని విమర్శించారు. గొర్ల కాపరులకు నగదు బదిలీ కింద వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలని డిమాం డ్‌ చేశారు. బీసీలకు రుణ సాయం కోసం రూ.లక్షా అంది స్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. కానీ దరఖాస్తు చేసుకోవడానికి సమయం సరిపోవడం లేదనీ, దర ఖాస్తులు గడువు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు లేనియేడల ప్రజలందరినీ ఏకం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.అంజయ్య, ధర్మన్నగూడ సర్పంచ్‌ భాషయ్య, అమీర్‌పేట మల్లేష్‌, చందు నాయక్‌, ఆలంపల్లి జంగయ్య, ఎం జంగయ్య, ఎం శ్రీమన్‌ నారాయణ, ఎం రాములు, పి. వెంకటయ్య, జంగయ్య, ఎస్సార్‌ ఆంజనే యులు, పుష్ప,ఎం. మహేందర్‌, బి. శ్రీశైలం,కె. వినోద్‌, బి. మల్లేష్‌, బుగ్గ రాములు, గోపాల్‌, రూపేందర్‌ పాల్గొన్నారు.