
– వర్షానికి కురిచే గురుకులాలు ఎన్నో ఉన్నాయి.
– సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి.
– విద్యారంగానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి. లేకుంటే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తాం.
నవతెలంగాణ – చిన్నకోడూరు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుందని విద్యాభివృద్ధి కోసం నిధులు కేటాయించకుండా రాష్ట్ర విద్యారంగ ప్రగతి అగిపోయిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, సిఐటీయు సిద్దిపేట జిల్లా సహాయకార్యదర్శి చొప్పరి రవికుమార్ లు విమర్శించారు. బెజ్జెంకి నుండి చిన్నకోడూరుకు చేరుకున్న సైకిల్ యాత్రకు మద్దతు తెలిపారు. సైకిల్ యాత్ర ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నోట్ బుక్ లు, యూనిఫామ్, పెట్టెలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయలేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంటర్ విద్యార్ధులకు ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, లెక్చరర్స్ లేరని, గెస్ట్ లెక్చరర్స్ ని రెన్యూవల్ చేయలేదని అన్నారు. గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వర్షకాలంలో తీవ్ర ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కోంటున్నారనీ, సరైన సౌకర్యాలు లేక సరిపడా ముత్రశాలలు, మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచినట్లు ఆర్బాటాలు చేసి ఇప్పటీకీ పెంచిన మెనూ అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 24,000 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయలేదని పాఠ్యపుస్తకాలు లేకుండా, టీచర్లు లేకుండ ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. హస్టల్స్ విద్యార్ధులకు నెలకు బాలురకు రూ.62, బాలికలకు రూ.100 రూపాయలు కాస్మోటిక్ ఛార్జీలు మాత్రమే ఇస్తున్నారనీ, వాటితో విద్యార్థులు అవసరాలకు ఎలా సరిపోతాయని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల దుస్థితి గురించి సాక్షతూ కెసిఆర్ మనుమడే ఈ మద్య చెప్పాడని అన్నారు. రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేసి కార్పోరేట్ ఫీజులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు రీయంబర్స్ మెంట్స్ రూ.5,177 కోట్లు బకాయిలు ఉన్నాయని వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ యాత్ర క్షేత్ర స్థాయిలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగుతుందని తెలిపారు. ఈ సైకిల్ యాత్రలో ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రెడ్డమైన అరవింద్, కార్యదర్శి దాసరి ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండం సంజీవ్ కుమార్, ఆముదాల రంజిత్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు నాచారం శేఖర్, సంతోష్, జిల్లా నాయకులు భరత్, ప్రశాంత్, మధు, ప్రవీణ్, రాంచరణ్, తదితరులు ఉన్నారు.