అనాధ పిల్లలకు డ్రెస్సులు పంపిణీ

నవతెలంగాణ – సిద్దిపేట
శిల్పా డ్రెస్సెస్ కు చెందిన సంకా శ్రీధర్ కుమారుడు సంక అద్వై జన్మదిన సందర్భంగా పట్టణంలోని బాలసదనంలో 22 మంది అనాధ పిల్లలకు డ్రెస్సులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో బాలసదనం నిర్వాహకులు రమ,  సంకా శ్రీధర్ కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.