– వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని తూరుబాక గ్రామంలో గల దళిత కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జాడలేవని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ఆరోపించారు. మంగళవారం వ్యకాస ఆధ్వర్యంలో దళిత కాలనీని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీతో ప్రజలకు సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందించడం లేదన్నారు. అక్టోబర్ 3న మండల కేంద్రంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లి సత్యనారాయణ, బిల్లా ముత్యాలరావు గంప నాగేశ్వరరావు, బిల్లా పార్ధు, బిల్లా ప్రతాప్, నరసింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.