– దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారు
– మహిళలు లేకుండా సృష్టి లేదు
– అడా బిడ్డ పుట్టిన మగ బిడ్డ పుట్టిన సంతోషంగా దైవ ఆజ్ఞగా స్వాగతించాలి
– తాను ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం నూతన వదు-వరులకి కానుకగా నూతన వస్త్రాలు ఇస్తాను
– కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బీగాల
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ నగరానికి చెందిన లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులని న్యూ అంబేద్కర్ భవన్ లో బుధవారం పంపిణీ పంపిణీ చేశారు. టే (190 చెక్కులు x100116/-=19,022,040/-) ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..సంక్షేమం లో తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగం.కళ్యాణ లక్ష్మీ పథకం తో అడా బిడ్డల్లో సంతోషం.ముఖ్యమంత్రి కేసీఆర్ అడా బిడ్డల కి సంతోషంగా పెళ్లి పంపాలని కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశ పెట్టారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ చెక్కును మంజూరు చేస్తే నా సొంత ఖర్చుతో వదు వరులకి నూతన వస్త్రాలు కానుకగా ఇస్తున్నాను.
– మహిళల కొరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోంది.
– కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్,వితంతు మహిళలు,ఒంటరి మహిళలకి పింఛన్, బాలికలకు గురుకుల పాఠశాలలో ఉచితంగా విద్యని అందిస్తుంది.
– ఆసరా పింఛన్లు అందిస్తూ భరోసా ఇస్తుంది ప్రభుత్వం.
– గర్భిణి స్త్రీలకు అంగన్ వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం, ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ తో పాటుగా విడతల వారీగా 12000/-రూ.నగదు అందిస్తున్నాము.మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణగా 24 గం. పని చేస్తున్నాయి.ప్రతి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం కానుకగా బతుకమ్మ చీరను అందిస్తుంది.అభివృద్ధి లో నిజామాబాద్ నగరం ముందంజ లో ఉంది.అండర్ గ్రౌండ్ డ్రైనేజి, రైల్వే అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను యుద్ధ ప్రాతికన పూర్తి చేస్తాము.నగరం లో ఎక్కడ చూసినా పచ్చదనంతో వెల్లివిరుస్తుంది.ప్రజా సంక్షేమం-అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి మీ అందరి మద్దదు ఉండాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్,మాజీ మేయర్ ఆకుల సుజాత ,బి.ఆర్.ఎస్ నాయకులు భైఖాన్ సుధ మధు,చంద్ర కల,సుజిత్ సింగ్ ఠాకూర్,సూదం రవి చందర్,సత్య ప్రకాష్, దారం సాయిలు, సిర్ప రాజు,ధర్మపురి,పంచారెడ్డి సూరి,మాయవార్ సాయిరాం, అంతరెడ్డి దేవి, మల్లేష్ యాదవ్, వెల్డింగ్ నారాయణ, ఆకుల శ్రీను,ఎర్రం గంగాధర్, మాకు రవి, మల్కాయి మహేందర్, కులచరి సంతోష్, యమగంటి నరేందర్ గౌడ్, సదనంద్, కరిపే రాజు, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.