తిప్పన సిద్ధులను సన్మానించిన గవర్నర్‌

నవతెలంగాణ-భద్రాచలం
బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, జిల్లా సైనిక్‌ డైరెక్టర్‌, తెలంగాణ ఉద్యమకారులు, భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ తిప్పనసిద్ధులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌ ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాదు రాజభవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లో భాగంగా 1969 తెలంగాణ ఉద్యమ నేత తిప్పనసిద్ధులను గవర్నర్‌ సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. తిప్పన సిద్దులతో పాటు మరికొంతమంది ఉద్యమ నేతలు కూడా గవర్నర్‌ సన్మానించారు.