అలయ్‌ బలయ్‌లో పాల్గొన్న హర్యానా గవర్నర్‌

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హాజరై అంబేద్కర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు పూలు వేసి నివాళి అర్పించారు. ప్రజా గాయకుడు గద్దర్‌ పాల్గొని.. ప్రభుత్వం నియంత పాలన అవలంబిస్తుందని, అమరులను విస్మరించడం, త్యాగాలను మరచిపోవడం సమంజసం కాదని వ్యాఖ్యానిస్తూ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి మాచినేని శ్రీనివాస్‌, మాజీ ఎంపీ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌, జర్నలిస్టు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.