ప్రభుత్వ హోమియోపతి జూనియర్‌ డాక్టర్ల ధర్నాకు

Govt homeopathic junior doctors sit on strike–  గడ్డం సాయి కిరణ్‌ సంఘీభావం
నవతెలంగాణ- హైదరాబాద్‌
స్థానిక రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో ఎనిమిదేండ్లుగా స్టైఫండ్‌ పెంచకుండా వైద్య విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోన్న ప్రభుత్వ వైఖరి మారాలని శాంతియుతంగా 8 రోజుల నుండి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు టీఆర్‌వైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం సాయి కిరణ్‌ హాజరై వైద్య విద్యార్థుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యా, వైద్యంపై ప్రభుత్వం పూర్తి అలసత్వం ప్రదర్శించడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. గౌరవ హైకోర్టు తక్షణమే విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కరించలేని పక్షంలో ఆందోళన ఉధతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్‌ జూనియర్‌ డాక్టర్లు ,పీజీ విద్యార్థులు, టీఆర్‌వైఎఫ్‌ సభ్యులు రాఘవేంద్ర రెడ్డి, రాంబాబు, కార్తీక్‌, అరవింద్‌, రవీందర్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.