ఎమ్మెల్యే ఇంటి ఎదుట జీపీ కార్మికుల నిరసన

– సమస్యలు పరిష్కరించాలని తాండూరు పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షునికి వినతి
– సమస్యలపై ప్రభుత్వ, అధికారులతో చర్చించి న్యాయం చేయాలి
– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌
నవతెలంగాణ-తాండూరు
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించా లని కోరుతూ మంగళవారం తాండూరు పట్టణ కేంద్రంలో ని ఎమ్మెల్యే ఇంటి ముందు కార్మికులు నిరసన కార్యక్రమా న్ని నిర్వహించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు అప్పు నయీమ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వ ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సమస్యలపై నిరవధిక సమ్మె 13 రోజులు కావస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన సమస్యలైన 17 డిమాండ్లను పరిష్క రించాలని కోరుతూ తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి నివా సం వద్దకు గ్రామ పంచాయతీకి కార్మికుడు ప్లే కార్డ్స్‌తో బ్యా నర్లతో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి వివరించే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్‌, వ్యకాస జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, కేవీపీస్‌ జిల్లా సహాయ కార్యదర్శి గోపాల్‌ మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయంమైన డిమాండ్లు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. అనేక రోజుల నుండి గ్రామమాన్ని పరిశుభ్రతగా ఉంచుతూ పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలన్నారు. కనీస వేతనం రూ.19 వేలు ప్రతి నెల ఐదో తేదీలోపు ఎస్టీ వన్‌ నుండి డైరెక్ట్‌గా కార్మికుల అకౌంట్లో జమ చేయాలన్నా రు. కార్యక్రమంలో తాండూర్‌ మండలం గ్రామపంచాయతీ కార్మికుల అధ్యక్షులు శాంతమ్మ, వెంకటమ్మ,నర్సింలు, జగన్‌, జిలాని, దస్తప్ప,కిష్టప్ప,బషీరాబాద్‌ మండల అధ్యక్షులు శామ ప్ప, లక్ష్మి, చందు, మొగులప్ప, యలాల్‌ మండలం నాయకు లు అరిప్‌, షబ్బీర్‌, రాములు, పెద్దేముల్‌, మండల నాయకు లు అంబరప్ప, శ్రీనివాస్‌, బాలమణి, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.