– సీఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి
నవతెలంగాణ-చర్ల
ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, మినీ టీచర్లకు, హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని సీఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్‌కు 10 లక్షలు హెల్పర్ కు 5లక్షలు ప్రకటించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎటువంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్ల ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో తొలిరోజు అంగన్‌వాడీల సమ్మెను మండల కేంద్రంలో ప్రారంభించి మాట్లాడారు. ఆగస్టు 18న అంగన్వాడీ ఉద్యోగ సంఘాలతో మంత్రి సత్యవతి రాథోడ్ జరిపిన చర్చలు ఇచ్చిన హామీలు వాటికి విరుద్ధంగా ఆగస్టు 25న మంత్రి ప్రకటన జారీ చేశారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించినందువల్లనే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పోషకాహారం అందించడం లేదని నెలలు తరబడి కందిపప్పు, కోడిగుడ్లు తదితర సరుకులు రావటం లేదని పేర్కొన్నారు. ఈ సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పాయం రాధాకుమారి, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం విజయశీల, సిఐటియు మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, నాయకులు కమల మనోహరి, ఇర్ఫా సత్యవతి, త్రివేణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పినపాక : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు పినపాక ఎంపీడీఓ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వారికి దీక్షకు సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. అనేక ఏళ్లుగా తమ సమస్యలను పదే పదే మొరపెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, హెల్పర్లు, తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం
ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటీయు జిల్లా అద్యక్షులు కె బ్రహ్మాచారి, ఏఐటీయుసి నాయకులు నోముల రామిరెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా సోమవారం లకీëనగరం స్టేట్ బ్యాంకు ఎదురుగా అంగన్వాడీలు చేపట్టిన మొదటి రోజు సమ్మె శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, యూనియన్ నాయకురాళ్లు కృష్ణవేణి, కమలాదేవి, గజలకీë, బుచ్చమ్మ, ఆదిలకీë, రత్నకుమారి, చిన్నారి పాల్గొన్నారు.