మండలంలో ఘనంగా హరితోత్సవం

– మొక్కలు నాటిన అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాటి
నవతెలంగాణ- తాడ్వాయి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ఘనంగా హరితోత్సవ కార్యక్రమంలో నిర్వహించారు. ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, మండల అభివృద్ధి అధికారి సత్యాంజనేయ ప్రసాద్, అటవీశాఖ అధికారులు సత్తయ్య, చౌకత్ అలీ, మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర అధ్యక్షతన మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్లాంటేషన్లను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీశాఖాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన మొక్కలు విరివిరిగా నాటి, వాటిని సంరక్షించాలని తెలిపారు. అలాగే మేడారంలోని ఆదివాసి మ్యూజియం లో అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవి అధ్యక్షతన స్థానిక సర్పంచ్ చిడం బాబురావు, కాటాపూర్ పాఠశాల, హాస్టల్ ఆవరణలో స్థానిక సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ, ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సజ్జన్లాల్, వార్డెన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లలో హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.