రెంజల్ మండలంలో ఘనంగా దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనలు

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనలు ఘనంగా నిర్వహించారు. మండలంలో 10 నుంచి 12 గ్రామాల లో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నాయని రెంజల్ ఎస్సై ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో దుర్గామాత ప్రత్యేక పూజలను నిర్వహించడానికి యువత మాలలు ధరించి తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. శివన్నవరాత్రుల పురస్కరించుకొని, దుర్గామాత తొమ్మిది రోజులు ఒక్కొక్క అవతారాన్ని ధరించి దర్శనం ఇస్తుందని వారు పేర్కొన్నారు.