నవతెలంగాణ-నేలకొండపల్లి
గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి తాసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అనురాగబాయి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కే.జమలారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఐకెపి కార్యాలయంలో ఏపీఎం అశోక్ రాణి, ఎన్‌ఎస్పి కార్యాలయంలో డీఈ మన్మధరావు, కార్యాలయంలో ఎస్టిఓ ఎన్వి కృష్ణారావు, మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి దేశబోయిన అరుణకుమారి, మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. నేలకొండపల్లి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి దేవేందర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ పోశెట్టి, పోలీస్ స్టేషన్లో ఎస్సై సతీష్, భక్త రామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పాలడుగు పూర్ణచందర్ ప్రసాద్, నేలకొండపల్లి బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, వివిధ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఫిబ్రవరి 2 తేదీతో గ్రామపంచాయతీ సర్పంచులు పదవీకాలం ముగుస్తున్నందున తమ గ్రామాభివృద్ధికి సహకరించిన మండల అధికారులను మండలంలోని కొత్త కొత్తూరు గ్రామ సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ గ్రామపంచాయతీ కార్యాలయానికి ఆహ్వానించి పాలకవర్గం తరఫున ఘనంగా సన్మానించారు. గ్రామపంచాయతీ సర్పంచ్‌గా వల్లాల రాధాకృష్ణ తమకు అన్ని విధాల సహకరించినందున ఎంపీడీవో కే. జమలారెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, ఎంపీఓ శివ, ఈజీఎస్ ఏపీఓ ఆర్ సునీత, సూపరింటెండెంట్ బండి భాస్కర్ రావు, స్థానిక సర్పంచ్ రాయపూడి నవీన్ భక్తురాంధ్ర సర్వీసోసైటీ ప్రధాన కార్యదర్శి ఎలమద్ది లెనిన్, ఐకెపి సీసీ వెంకటేశ్వర్రావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి, నాయకులు గొడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, కె.వి చారి టిఆర్‌ఎస్ నాయకులు నాగుబండి శ్రీనివాసరావు, మరికంటి రేణుబాబు, కోటి సైదారెడ్డి, నంబూరి సత్యనారాయణ, గొలుసు రవి, గ్రామ పంచాయతీల సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం మండలంలో
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చుంచు శ్రీనివాస్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ పిల్లి రాంప్రసాద్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వరాల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి సీతారాం రెడ్డి, కస్తూరిబారు పాఠశాలలో రమా కుమారి, పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాసరావు జాతీయ జండా లు ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్ నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్ నాయక్, జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ సైఫుద్దీన్, తాసిల్దార్ పిల్లి రాంప్రసాద్, స్థానిక ఎస్సై వరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ తో కలిసి మహాత్మ గాంధీ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐన్టీయూసి సేవాదళ్, మైనారిటీ జిల్లా అద్యక్షులు కొత్తా సీతారాములు,ఎస్డి గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ రాష్త్ర ఓబీసీ సెల్ నాయకులు వడ్డేబోయిన నరసింహరావు, రాష్ట్ర మైనారిటీ నాబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, డిప్యూటీ మేయర్ జోహార్ ముక్తార్, కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేందర్, మాజీ కౌన్సిలర్స్ పాలకుర్తి నాగేశ్వరరావు, కూల్ హౌమ్ ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేని రమేశ్, గజ్జెల్లి వెంకన్న, కామా అశోక్, తాళ్లూరి హనుమంతరావు, కల్లూరు సోమనాథం, గజ్జి సూర్యనారాయణ, నగర ఐఎన్‌టియుసి అధ్యక్షులు నరాల నరేష్, నగర కాంగ్రెస్ నాయకులు సంపుటం నరసింహరావు పాల్గొన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో
రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులా నరేందర్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సోజన్య, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, కొత్త సీతారాములు, మానుకొండ రాధా కిషోర్, తాళ్లూరి హనుమంతరావు, వడ్డేబోయిన నరసింహారావు పాల్గొన్నారు.