మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన

Great response to the mega job fairనవతెలంగాణ-సుజాతనగర్‌
అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాల నందు డిజిటల్‌ ఎంప్లాయ్మెంట్‌ ఎక్స్చేంజ్‌ వారు నిర్వహించినటువంటి మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. కళాశాల చైర్మెన్‌ దోస్పాట్‌ వెంకటేష్రావు, సెక్రటరీ చావా లక్ష్మీనారాయణ, డీఈఈటీ జనరల్‌ మేనేజర్‌ అనిల్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని దాన్లో భాగంగానే మెగా జాబ్‌ మేళా నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ జాబ్‌ మేళా నందు 25 కంపెనీల వారు పాల్గొంటున్నారని రానున్న రోజుల్లో తమ కళాశాల ద్వారా మరిన్ని జాబ్‌ మేళాలో నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పదో తరగతి డిగ్రీ బి.టెక్‌ పీజీ ఫార్మ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. ఎంపికైన వారికి పదివేల నుండి 40 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఫార్మా మెడికల్‌ ఐటి బ్యాంకింగ్‌ వండి కంపెనీల వారు జాబ్‌ మేళాలో పాల్గొన్నారు. జాబ్‌ మేళాకు 1500 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోక 900 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని వారి ప్రతిభ ఆధారంగా 400 మందిని ఎంపిక చేసినట్లు డీఈఈటీ వారు తెలిపారు. అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాల నందు రానున్న రోజుల్లో క్యాంపస్‌ ప్లేస్మెంట్స్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీ.సీతారాం ప్రసాద్‌, రమేష్‌, శ్రీకాంత్‌, సైదయ్య, హెచ్‌ఓడీలు బాబురావు, లక్పతి, మునీర్‌, వెంకటేశ్వర్లు, కృష్ణమోహన్‌, రవికిరణ్‌,శ్రీనివాస్‌, అధ్యాపకులు డింపుల్‌, శృతి, వాణి, శిరీషయ్య, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.