– పారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులుగా కొప్పు పద్మ
– జిల్లా ఉపాధ్యక్షులుగా బైరి వినోద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్ జిల్లా మత్స్య, పారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులుగా కొప్పు పద్మ, ఉపాధ్యక్షులుగా బైరి వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని మత్స్యశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం(టీఎమ్‌కేఎమ్‌కేఎస్) రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎమ్‌కేఎమ్‌కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన పాలక వర్గం రాబోయే ఐదేండ్ల కాలంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. చేపల మార్కెటింగ్, ఫిష్‌ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి మత్స్యకారులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మంది ప్రజలకు పౌష్టికాహారమైన చేపలు మార్కెటింగ్‌లో అధునాతన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎన్నికైన పాలక వర్గం మత్స్యకారులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ అభినందన సభలో నూతన డైరెక్టర్లు కర్రెల్లి లలిత, ముఠ దశరథ, పి. నాగమణి, మెట్ఠు విజయ లక్ష్మీ, కట్ట లింగం, ఎ.సుదా రాణి, కె.అరుణ, పి.వరలక్ష్మి, సంఘం నాయకులు అర్వపల్లి. శ్రీరాములు, గుడిపల్లి. కనకతార, చంద్రి, పుష్పా, బక్కి బాలమణి, రాజమణి, కె.శశిరేఖ పాల్గొన్నారు.