గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ఫౌండేషన్‌ ప్రారంభం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నగరాల్లోని పర్యావరణ సవాళ్లపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప్రజలు సహకరించాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కోరారు. సోమవారం పర్యావరణ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిసర ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌లోనూ పర్యావరణ సమస్య ఉందని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని రెండడుగుల బావి పునరుద్ధరణకు 360 లైఫ్‌ అనే సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత రెండేండ్లుగా నగరంలో 20 మెట్ల బావులను పునరుద్ధరించారని తెలిపారు.