11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

– 3.80 లక్షల మంది దరఖాస్తు : సర్వం సిద్ధం చేసిన టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 11న తెలంగాణ తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌ -1 ప్రిలిమినరీ రాతపరీక్షను కూడా నిర్వహించారు. ఆ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 25,150 మంది అభ్యర్థులను గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలకు కూడా అర్హత సాధించినట్టు టీఎస్‌ పీఎస్సీ ప్రకటించింది. అయితే ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌ పీఎస్సీ రద్దు చేసింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి ఈనెల 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు సర్వంసిద్ధం చేశా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లాల కలెక్టర్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీఎస్‌పీఎస్సీ ఆదేశించింది. ఉదయం 10.15 గంటలకే పరీక్షా కేంద్రం వద్ద గేటు మూస ివేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లని అధికారులు సూచిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. హాల్‌టికెట్లలో ఉన్న నిబంధన లను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటు ంది. అభ్యర్థులు ష్యూ వేసుకుని రావడానికి అవకాశం లేదు. అక్టోబర్‌ 16న నిర్వహించిన పరీక్షకు సంబం ధించిన హాల్‌టికెట్‌ చెల్లుబాటు కాదని స్పష్టం చేసి ంది. కొత్త హాల్‌టికెట్‌తో వస్తేనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని వివరించింది.