గ్రూప్-2 అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలి

నవతెలంగాణ- కంటేశ్వర్
గ్రూప్ 2 అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని విద్యార్థుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం. అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని మానుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఆరు లక్షల గ్రూప్ టు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ గైని గంగాధర్ మండిపడ్డారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నిజామాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరిని మానుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఆరు లక్షల మంది గ్రూప్-2 అభ్యర్థుల జీవితాలతో చిలగాటమాడుతూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గి విద్యార్థుల జీవితాలకు న్యాయం చేయాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  శాంతియుతంగా పిలుపునిచ్చినటువంటి సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం మొత్తం ప్రతిఘటిస్తూ కలిసి నడవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ గైని గంగాధర్ , జిల్లా అధ్యక్షులు పల్లికొండ నర్సయ్య , జిల్లా కమిటీ సభ్యులు పీట్ల శ్రీనివాస్  ఎర్రోళ్ళ గంగాధర్ , హరీష్ , ఆర్మూరు నియోజకవర్గ ఇంచార్జ్ సుధాకర్ , రూరల్ ఇంచార్జ్ కళ శ్రీనివాస్ , భోధన్‌ ఇంచార్జ్ సింగిడి పాండు , బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ గుంటి బెనర్జీ , జిల్లా నాయకులు జిన్న సంపత్, నట్ట అనంత్ , నీరడి శంకర్, రామకృష్ణ , గండికోట రాజన్న , బోర్రోళ్ళ సూరేషయ గారు, ఎర్రోళ్ళ ప్రేమ్ కుమార్ , తలరి రణవీర్, తదితరులు పాల్గొన్నారు.