నవంబర్‌ 2,3 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రూపు-2 పరీక్షను నవంబర్‌ 2,3 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీస్సీ) ఆదివారం ప్రకటించింది. రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి 12.30గంటలకు, మధ్యాహ్నాం 2.30గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే ఈనెల 28,29 తేదీల్లో నిర్వహించాల్సిన ఈ పరీక్షను విద్యార్థుల ఆందోళనలు, విపక్షాల డిమాండ్‌తో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి రద్దుచేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.