ఏడాది చివరి నాటికి జిఎస్‌టి ట్రిబ్యునల్‌ సాకారం

By the end of the year Implementation of GST Tribunal– హైదరాబాద్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌
– చీఫ్‌ కమిషనర్‌ సందీప్‌ ప్రకాష్‌ వెల్లడి
హైదరాబాద్‌ : జిఎస్‌టి ట్రిబ్యునల్‌ ఈ ఏడాది చివరి నాటికి వాస్తవరూపం దాల్చనుందని హైదరాబాద్‌ జోన్‌ కస్టమ్స్‌, సెంట్రల్‌ టాక్స్‌ చీఫ్‌ కమీషనర్‌ సందీప్‌ ప్రకాష్‌ అన్నారు. 50వ జిఎస్‌టి కౌన్సిల్‌ సిఫార్సులపై ఎఫ్‌టిసిసిఐలో జరిగిన ఓ సమావేశంలో జిఎస్‌టి కన్సల్టెంట్లు మరియు కార్పొరేట్‌ల బందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ నాటికి జిఎస్‌టి ట్రిబ్యునల్‌ పని చేస్తుందని, కనీసం కొన్ని బెంచ్‌లు పని చేయడం ప్రారంభిస్తాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. నగరంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని కమిషనర్‌ గుర్తు చేసుకున్నారు. ”నేను 1991లో సుమారు 32 సంవత్సరాల క్రితం ట్రైనీ ఆఫీసర్‌గా ఈ నగరానికి వచ్చాను. ఇప్పుడు నేను చీఫ్‌ కమిషనర్‌ని. అప్పటి నుండి నగరం చాలా మారిపోయింది. నగరంతో నాకున్న అనుబంధాన్ని ఎంతో గౌరవిస్తాను.” అని సందీప్‌ ప్రకాష్‌ అన్నారు.ఒకప్పుడు మనకు చాలా పన్నులు ఉండేవి మరియు చాలా గందరగోళం ఉండేది . ఆ పరిస్థితి అంతా ఇప్పుడు గతించిపోయిందన్నారు.