– ఏఐకెఎస్ క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. తెలంగాణ రైతు సంఘం (ఏఐకెఎస్) 2024వ సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్‌ని స్థానిక మంచి కంటి భవన్‌లో పోతినేని ఆవిష్కరించారు. శుక్రవారం ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం ఎలమంచిలి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీని తక్షణం అమలు చేయాలని, రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.15,000లు రైతుల అకౌంట్‌లో జమ చేయాలని, రవి సీజన్‌లో పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధుని రైతులు అకౌంట్‌లో ఒకే దఫాలో వేయాలని ఆయన అన్నారు. 2024వ సంవత్సరంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, నాయకులు కున్సోతు ధర్మ, ఊకంటి రవికుమార్, దొడ్డ లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసయ్య, కోబల్, కొండబోయిన వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, కనకరత్నం, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.