
సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సీఈఐఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు సీఐ కె ఫనిధర్ అన్నారు. గుండాల మండలానికి చెందిన ఇరుప పోట్టయ్య మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల ఓ పెండ్లికి హాజరైన క్రమంలో తన మొబైల్ పోవడంతో వెంటనే కొత్తగూడ పోలీస్ స్టేషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేయగా ఎస్సై నగేష్ ఆధ్వర్యంలో సీఈఐఆర్ యాప్ ద్వారా పోట్టయ్య పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను కనిపెట్టి శుక్రవారం సిఐ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు. సిఈఐఆర్ యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మీ మీ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే తగిన సమాచారంతో పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ నగేష్ పాల్గొన్నారు.