నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఫ్లోరెన్స్ నైటింగేల్ 203 జన్మదినం సందర్భంగా కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్‌లో అంత ర్జాతీయ నర్సుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆర్‌ఎంఓ డాక్టర్ సాధన హాజరై క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి, డాక్టర్ ఆంజనేయులు, నర్సింగ్ సూపరింటెంట్ ఎస్తేర్, హెడ్ నర్స్ పాలిన, స్టాఫ్ నర్స్ మేరీలిన్, ఝాన్సీ, సీహెచ్ మాధవి, నర్సులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.