సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం

నవతెలంగాణ-అడిక్‌మెట్‌/హిమాయత్‌నగర్‌
దేశ రాజధానిలో పాలనా సర్వీసుల నియంత్రధికారంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వల మధ్య నెలకొన్న చట్టపరమైన వివాదంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం నిజమైన అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉండాలని ఏకగ్రీవ తీర్పును ప్రకటించడంపై ఆమ్‌ ఆద్మీ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ పత్రికా ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. ఈ సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పు ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై విశ్వాసాన్ని పునరుద్ధరిచిందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీకి ఓటు వేసిన ప్రజల ఆదేశాన్ని ధిక్కరించి కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఢిల్లీ ప్రభుత్వ పాలనా హక్కులను రాష్ట్రాల జాబితాల్లో జాబితా చేయబడిన అంశాల్లో రాష్ట్రాల హక్కులను దౌర్జన్యంగా దెబ్బతీయడం సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పుతో అడ్డుపడుతోందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి పరిపాలనా సేవలపై శాసన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయనీ, ప్రభుత్వ సర్వీసెస్‌ నిర్ణయాలకు ఢిల్లీలో కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్ట్‌ రూలింగ్‌ ఇవ్వడాన్ని అయన స్వాగతించారు. ఢిల్లీలో అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతేరేక, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేక చర్యలు చేపట్టిన బీజేపీ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసారు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలో భాగంగా రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను అనుసరిస్తున్న బీజేపీని వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఓడించి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.