
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లో భాగంగా సోమవారం తెలంగాణ హరితోత్సవం నిర్వహించారు. అశ్వారావుపేట లోని పలు కార్యాలయాల్లో ఏర్పాటు కార్యక్రమాల్లో ఎం.పి.పి శ్రీరామ మూర్తి పాల్గొన్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (టి.ఎం.ఆర్.జే.సి) లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగ అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరనుండి ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం హరిత హరం కార్యక్రమంలో పాల్గొని కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరం మారుతున్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలను కాపాడాలని,ప్రతి జీవికి ప్రాణ వాయువు ఇచ్చేది మొక్కలే నని,అటువంటి మొక్కలను విద్యార్థులు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మొక్కలూ నాటడం వాటిని కాపాడుకోవడం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ శారా, ఉపాధ్యాయలు, సిబ్బంది విద్యార్ధులు పాల్గొన్నారు.