హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

ముంబయి : ప్రయివేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యువ గ్రాడ్యూయేట్లను ఒక ఏడాది లోగా బ్యాంకింగ్‌ నిపుణులుగా మార్చేందుకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ‘ఫ్యూచర్‌ బ్యాంకర్స్‌ 2.0’ని ప్రారంభించినట్లు తెలిపింది. మణిపాల్‌ గ్లోబల్‌ అకాడమీలోని బిఎఫ్‌ఎస్‌ఐతో కలిసి నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఒక ఏడాది కాలపరిమితితో ప్రొఫెషనల్‌ డిప్లమో కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. విజయవంతమైన అభ్యర్థులందరికీ రూ.5.59 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుందని వెల్లడించింది. ఆసక్తి కలిగిన వారు ‘హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ప్యూచర్‌ బ్యాంకర్స్‌’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.