– అట్టడుగు స్థాయి నుండి ఎంపిడిఓ స్థాయికి..
– కులి పనులు చేస్తూనే.. విద్యాభ్యాసం..
– స్థోమత లేకున్నా అనుకున్నది సాధించారు.. రాములు నాయక్.
నవతెలంగాణ డిచ్ పల్లి.
వ్యవసాయ, అటవీ ప్రాంతంలో ఉండే పండ్లు ఫలాలు కుడా గట్టుకుని అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం ఆనాడు గగనమే.. అయినా ఉన్నత చదువులు చదవాలని ఏకైక లక్ష్యంతో తాండకు పాఠశాల కిలోమీటర్లు దూరంలో ఉన్న కాలిబాటన వెళ్తూ ప్రాథమిక స్థాయి, ఉన్నతస్థాయి విద్యనభ్యసిస్తూ ఆపై చదువులకు జిల్లా కేంద్రాల్లోనే వసతి గృహంలో ఉంటూ సెలవులు దొరికినప్పుడల్లా దుకాణాలలో, జ్యూస్ సెంటర్లలో పనులు చేస్తూ పరీక్ష ఫీజులకు, ఇతర ఖర్చులకు తల్లిదండ్రుల కు ఇబ్బందులు పెట్టకుండా చదువులను పూర్తి చేసి నేడు ఎంపీడీవోగా రాములు నాయక్ విధులు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని బంజేపల్లి గ్రామపంచాయతీ (ఉమ్మడి సోమరిపేట్ గ్రామ పంచాయతీ) పరిధిలోని గుడితాండలోని తల్లిదండ్రులు సక్రియ గోరీబాయి లకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఐదవ సంతానం ఎంపీడీవో రాములు నాయక్. ఒకటవ తరగతి నుండి నాల్గవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల సోమరిపేట్ లో గుడితండాకు 5కిలోమిటర్ల దూరంలో కాలినడకన వెళ్లి చదువుకున్నారు.ఐదవతరగతి నుండి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాయిస్ హాస్టల్ లో, ఇంటర్ నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి లో చదువుకుని తల్లిదండ్రులకు ఉన్న కోద్ది పాటు వ్యవసాయ పనులు,ఇతర చోట్ల పనులు చేస్తూనే 1996లో బ్యాంక్ లాగ్ గ్రూప్ 4లో ఎంపైకై కామారెడ్డి ఎంపిడిఓ కార్యాలయంలో టైపిస్ట్ గా విధుల్లో చేరారు.పాదోన్నతి పోందరు.నిజామాబాద్ అర్ డ్లు ఎస్ కార్యాలయంలో సినియర్ అసిస్టెంట్ గా2005లో,2011 నుండి 2014 వరకు సదాశివ్ నగర్ లో సినియర్ అసిస్టెంట్ గా,2014లో నవీపెట్ ఈఓపిఅర్డిగా ఐదేళ్ల పాటు విధులు నిర్వహించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని నిజాంసాగర్ ఇంచార్జీ ఎంపిడిఓ గా బాధ్యతలు నిర్వహించి అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజు తో పాటు పలువురి మన్ననలు పొందారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలు చేసిన సమయంలో పదోన్నతి పొంది 2019 నుండి నేటి వరకు ఇందల్ వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పుర్తి స్థాయి (ఎంపిడిఓ) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తండ్రి తల్లిదండ్రులు వ్యవసాయ పంట పొలంతో పాటు పండు ఫలాలు అమ్ముకుంటూ తమ కుమారులకు ఉన్నత చదువులు చదివించడానికి ఎంతో కష్టపడ్డారని ఐదు కిలోమీటర్ల మేర ఆ రోజుల్లో సరైన రహదారులు లేకున్నా బురద రహదారులతోనే కాలేజీ నడకన రాకపోకలు సాగించుకుంటూ ఉన్నత విద్య నిర్దేశించామని రాముల నాయక్ పేర్కొన్నారు. ఆనాడు పరీక్ష ఫీజులు, ఇతర ఖర్చులకు డబ్బులు లేకపోతే బుక్కు సెంటర్, జ్యూస్ సెంటర్లలో ఇతర చోట్ల పనులు చేస్తూ పరీక్ష ఇతర ఫీజులను సంపాదించిన వాటిని కట్టుకునే వారమని వివరించారు. తల్లిదండ్రులు ఉన్న పూరి గుడిసెల్లోనే అన్నదమ్ములు అందరు కలిసి ఉండే వారమని ఆ రోజులు తలుచుకుంటే నేడు కన్నుల్లో నీళ్లు వస్తాయన్నారు.తండా జనాభా 700,1996లో గుడి తాండలోనే మొట్టమొదటగా సక్రియ గోరీబాయిలకు చెందిన ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. దాంతో వీరిని చూసి తండా వసులే కాకుండా ఇతర తాండలు, గ్రామాల్లో ఉన్నవారు అన్నదమ్ములను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను సైతం ఉన్నత చదువులు చదివిస్తున్నారని ఎంపీడీవో రాములు నాయక్ వివరించారు.
ప్రస్తుతం పెద్దన్న మోపాల్ ఇంచార్జ్ ఎంపీడీవోగా లింగం నాయక్ వీధులు నిర్వహిస్తున్నారు.
టైపిస్ట్ గా ఉద్యోగంలో చేరిన తర్వాత 2003లో రెడ్డి పెట్ మండలంలోని స్కూల్ తాండకు చెందిన మంజులతో వివాహం జరిగింది. తను చేసుకోబోయే అమ్మాయి మంజుల చదువుకోవాలని మనసులో ఉన్న విషయం భర్త రాములు నాయక్ కు తెలిపిన వేంటనే మంజుల అలోచనాల పరంగా చదువుకు అయ్యే డబ్బులను తనే భరిస్తానని మాట ఇచ్చి మంజులకు పీజీ తెలుగు లో బిఈ డి చేయించారు. వెంటనే కొన్ని ఏళ్ల తర్వాత ప్రభుత్వ అధ్యాపకురాలిగా ఉద్యోగం రావడంతో హర్షాతిరేకాలు తాండలో కుటుంబంలో వ్యక్తమయ్యాయి .ప్రస్తుతం సిరికోండ మండలంలో అధ్యాపకురాలిగా వీధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు సైతం ఉన్నత చదువులు చదువుతున్నారు.
నూతన మండలంకు ఇబ్బందులను అధిగమిస్తు అభివృద్ధి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలను ప్రకటించగా నూతనంగా ఏర్పడిన ఇందల్వాయి మండలాన్ని ఎన్నో ఇబ్బందులు ఉన్న ప్రజాప్రతినిధులు అధికారుల సహాయ సహకారంతో ఇబ్బందులను అధిగమిస్తూ గ్రామాలు అభివృద్ధి చేసేది శాఖ తనవంతు కృషి చేస్తున్న ఉన్నారు.ఇందల్ వాయి మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శంగా ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి శక్తి వంచన లేకుండా ఉదయమే గ్రామాలకు వెళ్తూ ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనులను పూర్తి చేయించడంలో తనవంతుగా కృషి చేస్తున్నారు. మండలానికి హరితహారం, ఉపాధి హామీలో ముందు వరసలో ఉంచడానికి కింది స్థాయి అధికారులకు పలు సూచనలు సలహాలను అందజేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేయిస్తూ ప్రశంసలు అందుకుంటున్నరు. అంచలంచెలుగా ఎదుగుతున్న రాములు నాయక్ సీనియార్టీ ప్రకారం కొద్ది ఏళ్ళ లోనే జిల్లా పరిషత్ సిఈఓ గా పదోన్నతి పొందే అవకాశం ఉందన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సైతం వీధిలో నిర్లక్ష్యం చేయకుండా కిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలను అందజేస్తూ,అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరితో పనులను చేస్తూ పలువురి మన్నానలను పొందుతున్నారు. ఎక్కడ వీధిని నిర్వర్తించిన అక్కడ అధికారులతో ప్రజాప్రతినిధులతో సంబంధాలను కోన సాగించేవారు రాములు నాయక్. అప్పటి కలెక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రశంస పత్రం ను సోంతం చేసుకున్నారు. కార్యాలయానికి పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ తమ చేతుల్లో ఉన్న వాటికి అప్పటికప్పుడే పరిష్కారం చూపుతూ ఇబ్బందులు కలగకుండా తన వంతు సహాయ సహకారాలను అందజేస్తు పలువురి మన్నానలను పొందుతున్నారు.
