కుడుములు పాడులో ఆరోగ్య శిబిరం 

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని నందిపాడు పంచాయితీ పరిధిలో గల కుడుములు పాడులో అశ్వారావుపేట (వినాయకపురం) ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, వైద్యాధికారి రాందాస్ పర్యవేక్షణలో శుక్రవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 43 మందికి పరీక్షలు నిర్వహించి చిరువ్యాధులకు చికిత్స అందించారు. ఐదుగురు జ్వర పీడుతులును గుర్తించి రక్త నమూనాలు ఆర్.డి.టి పరీక్షించిగా ఎవరికి మలేరియా నిర్ధారణ కాలేదు. సాధారణ జ్వరాలు గా గుర్తించి చికిత్స అందించారు. తర్వాత గ్రామంలో ఫ్రై డే – డ్రై డే నిర్వహించి ప్రతి ఇంటి పరిసరాలు నీటి నిల్వలు లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్.ఒ జయశ్రీ, సబ్ యూనిట్ అధికార వెంకటేశ్వరావు,హెచ్.ఎస్ శ్రీనివాస్,హెచ్.వి శాంత, కుమారి,ఎ.ఎన్.ఎం వెంకటలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ రవి,ఎం.టి.ఎస్ విజయారెడ్డి, ఆశా బుల్లెమ్మ పాల్గొన్నారు.