భగీరథతోనే ఆరోగ్యం భద్రం

శాస్త్రీయంగా శుద్ధి చేస్తున్న భగీరథ నీరు పీడీ కృష్ణన్‌
నవతెలంగాణ-కొడంగల్‌
ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు తీసుకురావడంతో అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది తెలంగాణ ప్రభుత్వ మని డీఆర్‌ డీఓ పీడీ కృష్ణన్‌ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాగునీటి పండుగను కొడంగల్‌లోని భగీరథ వాటర్‌ ప్లాంట్‌ ఆవరణలో భగీరథ డీఈఈ శశాంక్‌ మిశ్రా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీ డీ కృష్ణన్‌ మాట్లాడుతూ..భగీరథ నీటిని తాగాలని వైద్యు లు సైతం సూచిస్తున్నారని, మినరల్‌ వాటర్‌ అంటే భూమి లోని నీటిని ప్యూరిఫై చేసి కెమికల్స్‌ కలిపి మినరల్‌ వాటర్‌ గా విక్రయిస్తున్నారని అందులో మినరల్స్‌ ఉండవన్నారు. భూమిపై పారే నీటిని ప్యూరిఫై చేసి అందించే మిషన్‌ భగీ రథ నీటిలో మినరల్స్‌ ఉండడంతో ఇది ఎన్నో రకాల రోగా లను నివారించగలుగుతుందన్నారు. భగీరథ నీటి వాడ కంతో అతిసార వ్యాధులు రావడం లేదన్నారు. వర్షాకాలం వచ్చిందంటే గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు గతంలో నిర్వ హించేదని భగీరథ నీటిని శాస్త్రీయంగా శుద్ధి చేస్తున్నార న్నారు. ఎండాకాలం వచ్చిందంటే మహిళలు గ్రామాల్లో తా గునీరు లేక ఇబ్బందులు పడేవారని రాష్ట్రం ఏర్పాటు తర్వా త భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు వస్తుందన్నారు. భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడి భవిష్య త్‌ తరాలకు అందించాలన్నారు. భగీరథ నీరు సాఫ్ట్‌ వాటర్‌ అని నీటితో శరీరాన్ని కావలసిన మినరల్స్‌, ఎలిమెంట్స్‌ తగిన మోతాదులో అంది డయేరియా, హెపటైటిస్‌ రాకుం డా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ భగీరథ నీటినే వాడా లన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, ఎం పీపీ పటేల్‌ విజయకుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఉషారాణి, బోంరాస్‌ పేట్‌ ఎంపీపీ హేమీబాయి, కౌన్సిలర్‌ మధుసూదన్‌ యాదవ్‌, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌ రెడ్డి, మా జీ జడ్పీటీసీ మోహన్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బీములు, ఈఈ బాబు శ్రీనివాస్‌రావు, భగీరథ ఏఈ లు హుస్సేన్‌, శివసాయితేజ, రాఘవేందర్‌, జోహెల్‌, యా దయ్య, కౌన్సిలర్‌ శంకర్‌నాయక్‌, సర్పంచులు, పంచాయ తీ కార్యదర్శులు, అంగన్‌వాడి టీచర్లు, భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.