డ్రై ఫ్రూట్స్ జాబితాలో అత్యధిక పోషకాలు గలిగిన అక్రోట్ ముందుంటుంది. మెదడు పనితీరును పెంచటానికి ఇదెంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి అక్రోట్ చేసే మేలు గురించి తెలుసుకుందాం.
– మానసిక ఒత్తిడికి అక్రోట్స్ మంచి ఔషధం. ఆక్రోట్స్‌లోని ‘మెలటోనిన్’ సుఖ నిద్రకు, చక్కని జ్ఞాపకశక్తికి దోహదం చేస్తుంది.
– అక్రోట్స్‌లో ఎక్కువగా ఉండే పీచు జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. ఇందులో లభించే విటమిన్ ఇ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
– బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన అక్రోట్ రోగనిరోధక శక్తిని పెంచి రోగాలబారిన పడకుండా కాపాడుతుంది.
– అక్రోట్ వినియోగంతో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల హదయ రోగాలు నివారించబడతాయి.
– దీనిలో విరివిగా లభించే ఫాటీ ఆమ్లాలు, ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. చికిత్స పొందే రొమ్ము క్యాన్సర్ బాధితులు రోజుకో కప్పు అక్రోట్స్ తినటం వలన క్యాన్సర్ కణాల ఎదుగుదల మందగిస్తుంది.
– అక్రోట్స్‌లోని ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ఆరోగ్యంగా ఉంచటమే గాక చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్త పీడనం కూడా అదుపులో ఉండేలా చూస్తాయి. ఈ ఆమ్లాలు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని కాపాడటంతో బాటు సరైన సమయంలో ప్రసవం అయ్యేలా చేస్తాయి.
– రోజూ అక్రోట్ వాడే వారికి ఊబకాయం, జీవక్రియ లోపాలు, రక్తంలోని మోతాదుకు మించి కొవ్వు చేరటం, అధిక రక్త పోటు వంటి ఇబ్బందుల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. రోజూ నాలుగైదు అక్రోట్స్ తినేవారికి పిత్తాశయ రాళ్ళ సమస్య రాదు.