మహిళలను శక్తివంతం చేస్తున్న కుదుంబశ్రీ

Kudumbashree is empowering womenదేశంలోనే అతి పెద్ద మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో కేరళ రాష్ట్రంలో నడుస్తున్న కుదుంబశ్రీ మిషన్‌ ఒకటి. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా శక్తివంతంగా తయారు చేస్తున్న ఈ మిషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దీని ఆధ్వర్యంలో నడుస్తున్న బ్యాక్‌ టు స్కూల్‌ కార్యక్రమం లక్షల మంది మహిళలను తిరిగి పాఠశాలలకు రప్పించింది. అక్టోబర్‌ 1న తన రెండు నెలల తిరికే స్కూల్‌ (బ్యాక్‌ టు స్కూల్‌) ప్రచారాన్ని ప్రారంభించి డిసెంబర్‌ 10న ముగించనుంది. ఈ సందర్భంగా 35 లక్షల మంది మహిళల కలలను నిజం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ అక్టోబర్‌ 1న దేశంలోనే అతిపెద్ద మహిళల స్వయం సహాయక గ్రూపులలో ఒకటైన కుటుంబశ్రీ మిషన్‌ 46 లక్షల మంది సభ్యులను తిరిగి పాఠశాలకు పంపించడానికి రెండు నెలల ప్రచారాన్ని ప్రారంభించింది. నవంబర్‌ 6 నాటికి ‘తిరైకే స్కూల్‌’ (స్కూల్‌ టు స్కూల్‌) కార్యక్రమం కేరళలోని మొత్తం 14 జిల్లాల్లో 2 వేల పాఠశాలల్లో నిర్వహించిన వారాంతపు తరగతులకు 20 లక్షల మంది మహిళలను ఆకర్షించింది. 20,000 ప్రాంత అభివద్ధి సంఘాలు, 1,070 కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీలు(సిడిఎస్‌), 15,000 రిసోర్స్‌ పర్సన్‌, కుదుంబశ్రీ స్నెహిత, వివిధ శిక్షణా సమూహాల సభ్యులు, రాష్ట్ర, జిల్లా మిషన్‌ సిబ్బందితో సహా 50 లక్షలకు పైగా ప్రజలు ఈ ప్రతిష్టాత్మక ప్రచారంలో భాగమయ్యారు.
పాఠాలు మాత్రమే కాదు
తరగతి గదిలో మహిళలపైనే దష్టి పెడతారు. అందరూ దశాబ్దాల కిందట పాఠశాలలో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. కుదుంబశ్రీలో అనేక సమూహాలు ఉన్నాయి. అందరికీ ప్రత్యేక యూనిఫామ్‌లు ఉంటాయి. గులాబి, నారింజ, ఆఫ్‌ వైట్‌లోని కేరళ చీరతో కూడా అద్భుతమైన తేడాలు ఉన్నాయి. శిక్షకురాలైన శ్రీశ్మా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెబుతారు. సుమారు 50 మంది విద్యార్థులు ప్రతి పదాన్ని జాగ్రత్తగా వింటారు. ఇక్కడ పాఠాలు మాత్రమే కాదు మహిళలకు స్థానిక పాలనలో ఇస్తున్న ప్రాముఖ్యత, పితస్వామ్యాన్ని బద్దలు కొట్టడం వంటి విషయాల గురించి కూడా మాట్లాడుతారు. కిడ్నీ మార్పిడి కోసం డబ్బు సహాయం, భర్తను కోల్పోయిన వారికి సహాయం చేయడానికి కూడా ఈ సమూహాలు ముందుకు వస్తాయి. శ్రీశ్మా కుడుంబశ్రీ మిషన్‌ లక్ష్యాలు, ఆర్థికంగా, డిజిటల్‌గా అక్షరాస్యులు, మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించాల్సిన అవసరాన్ని వివరిస్తారు. ‘వేసవిలో మీ ఇళ్లలో పెరిగే జాక్‌ఫ్రూట్‌, మామిడితో మీరు ఏమి చేస్తారు?’ ఆమె అడుగుతుంది. ఒక మహిళ లేచి నిలబడి ‘నేను జాక్‌ఫ్రూట్‌తో జామ్‌లు, మామిడితో ఊరగాయలను తయారు చేసి వాటిని అమ్ముతాను’ అని చెబితే చుట్టూ చప్పట్లు మోగాయి.
జీవితాలను మారుస్తుంది
స్టేట్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ అయిన నిషద్‌ సిసి మాట్లాడుతూ ‘కుదుంబశ్రీ మిషన్‌ 2023లో 25 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఇది 1997లో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కార్యక్రమంగా ప్రారంభమైంది. మహిళలను శక్తివంతంగా తయారు చేయడానికి ఇదొక మంచి కార్యక్రమంగా మేము నిర్ణయించుకున్నాము. రాష్ట్రంలో మైక్రో-ఫైనాన్స్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్న మూడు లక్షల మంది సభ్యులకు అవగాహన కల్పించడం అత్యవసరమని భావించాము. ఆర్థిక ప్రణాళిక, మైక్రోఫైనాన్స్‌, సంస్థ లక్ష్యాలు, అది ఎందుకు ఉనికిలో ఉంది, సామాజిక సమైక్యత, జీవనోపాధి అవకాశాలకు, డిజిటల్‌ అక్షరాస్యతకు పరిచయం చేయడం వంటి వాటి గురించి మహిళలకు అవగాహన కల్పించడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.
సమాజ ప్రయత్నం
కుదుంబశ్రీ ప్రచారం విజయవంతం కావడానికి స్థానిక పాలన కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పుతుకోడ్‌ పంచాయతీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న దీపా మాట్లాడుతూ ‘మహిళలు తమ యూనిఫాం ధరించి పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా పంచాయతీలో 4,300 గ్రూపులు ఉన్నాయి. మహిళలు వ్యవసాయం, క్యాటరింగ్‌, ఊరగాయ తయారీ మొదలైనవి చేస్తున్నారు. వారు బ్లాక్‌ యూనిట్ల నుండి సబ్సిడీ, కుడుంబశ్రీ నుండి రుణాలు పొందారు’ అన్నది. బ్యాక్‌ టు స్కూల్‌ తరగతులు జరుగుతున్న చీఖూ పాఠశాల అధ్యక్షులు హసీనా టీచర్‌ ఈ ప్రచారానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నారు. ‘ఇప్పుడు 50 నుండి 60 ఏండ్ల వయసు గల మా పాత విద్యార్థులు చాలామంది తిరిగి పాఠశాలకు రావడం చాలా అద్భుతంగా ఉంది. వీరి ఉత్సాహం ఇతరులను కూడా ప్రోత్సహిస్తోంది’ అని ఆమె చెప్పింది. రోజు అసెంబ్లీ సమయంలో మహిళలు మైదానంలో సమావేశమై కుదుంబశ్రీ ముద్రా గీతం(గీతం) పాడతారు.
వ్యాపారాలు ప్రారంభించి…
15 ఏండ్లు సిడిఎస్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన పుష్పాలాథ మనపద్దమ్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ యూనిట్‌ను నడుపుతోంది. ‘మహమ్మారికి ముందు నేను అద్దెకు భవనం తీసుకొని పూర్తి స్థాయి యూనిట్‌ను నడిపాను. 100 మంది అమ్మాయిలకు ఫ్యాషన్‌ డిజైన్‌ నేర్పించాను. మహమ్మారి సమయంలో జరిగిన నష్టంతో యూనిట్‌ను నా ఇంటి పైన ఉన్న పెద్ద గదికి మార్చాను. ఇక్కడ 10 మంది బాలికలు కుట్టు పనిలో నాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆన్‌లైన్‌లోకి ప్రవేశించాము, స్థానిక ఆర్డర్లు తీసుకుంటున్నాము’ అని చెప్పింది. దివ్య తన పంచాయతీలో 22 మంది సభ్యుల హరితా కర్మ సేన సమూహాన్ని ప్రారంభించింది. బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ కోసం పంపింది. శృతి ట్యూషన్‌ సెంటర్‌ను నడుపుతుంది. ఈ మహిళలందరూ తమ వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా స్కేల్‌ చేయడానికి కుదుంబశ్రీ పథకాలను సద్వినియోగం చేసుకున్నారు.
రాజకీయాలకు చోటు లేదు
‘మొదటి బ్యాచ్‌ కోసం మేము చాలా మంది సభ్యులు హాజరయ్యేలా కృషి చేశాం. రెండవ సెషన్‌ నాటికి ఇది మరింత విస్తరించింది. మహిళలు తమంతట తామే రావడం ప్రారంభించారు. కొన్ని చోట్ల మహిళలు తరగతులకు హాజరవకపోతే రుణాలు రావాలనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇది రాజకీయంగా చేస్తున్న ప్రచారం. కానీ ఈ మిషన్‌లో రాజకీయాలకు చోటు లేదని నిషద్‌ నొక్కిచెప్పారు. ఇది పూర్తిగా లౌకిక స్వభావం కలిగి ఉందన్నారు. ‘అయితే మా అతిపెద్ద సవాలు ఏమిటంటే జీవనోపాధి పథకాలను చేపట్టడానికి, సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎక్కువ మంది మహిళలను ప్రేరేపించడం మా లక్ష్యం. దీనిని వార్షిక ప్రచారంగా మార్చడం, కొత్త విషయాలను పరిచయం చేయడం’ అని వారు చెప్పారు.
వయసు కేవలం ఒక సంఖ్య
అలప్పుజా జిల్లాలో 100 ఏండ్ల రహెల్‌ రోహేకే స్కూల్‌ ప్రోగ్రామ్‌తో బాల్యంలోకి తిరిగి వచ్చింది. వద్ధాప్య బలహీ నతలు, నొప్పులను మరచిపోయి ఇతరుల సహా యంతో పాఠశాల మెట్లు ఎక్కింది. తరగతి గదిలో ఆమె మళ్ళీ ఒక పిల్లగా మారి ఆసక్తిగా అన్నీ నేర్చు కుంటుంది. మన ప్పడంలో కాంచనా (77), తంగం (73) తమ కుమార్తెలతో కలిసి తరగతులకు వెళుతున్నారు. ‘నేను ఏడవ తరగతి వరకు మాత్రమే పూర్తి చేసాను. ఇప్పుడు మరోసారి విద్యార్థిగా తిరిగి పాఠశా లకు రావడం చాలా బాగుంది. నాకు సొంత వ్యా పారం లేనప్పటికీ నేను అయల్కూటంలో భాగంగా ఉన్నాను. కుదుంబశ్రీ గురించి మరింత తెలుసుకో వాలని, నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశిస్తున్నాను’ అని కంచనా చెప్పారు. త్రీస్సూర్‌ జిల్లా లోని పోయా పంచాయతీలో 84 ఏండ్ల అమ్మిని తన జీవితంలో మొదటిసారి పాఠశాలకు హాజర య్యారు. ఆమె పూతతి సారావతి విద్యాలయలో బ్యాక్‌ టు స్కూల్‌ క్యాంపెయిన్‌ తరగతులకు వెళ్లారు. ఆమెకు అధికారిక విద్య లేకపోయినప్పటికీ ఇక్కడ చాలా నేర్చుకుంటున్నానని చెప్పారు. ఆమె చాలా ఏండ్లుగా వ్యవసాయ కార్మికురాలు.
విభిన్న ప్రతిభ ఉన్న మహిళలు
మనప్పడమ్‌లోని అలథూర్‌ బ్లాక్‌లో నేను సందర్శించే మూడు పాఠశాలల్లో అంజుమూర్తి మంగళం లోని గాంధీ స్మారక పాఠశాల, పుతుకోడ్‌లోని సర్వజానా హయ్యర్‌ సెకండరీ స్కూల్స్‌ ఉన్నాయి. తరగతులకు హాజరయ్యే మహిళలు వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చారు. వీరంతా విభిన్న ప్రతిభను కలిగి ఉన్నారు. రాధా గత రెండున్నరేండ్లుగా పంచాయతీ క్యాంటీన్‌ నడుపుతుంది. ఈమె సిడిఎస్‌ సభ్యురాలు కూడా. ‘ఇక్కడ నేను ఇంతకు ముందు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నాను. ఇది నా వ్యాపారాన్ని మెరుగుపరుస్తానని ఆశిస్తున్నాను’ అని ఆమె చెప్పింది.
– సలీమ

Spread the love
Latest updates news (2024-05-11 13:16):

can you test your blood sugar with uSx urine | normal blood sugar level M4T insulin resistant | Sc2 what dies low blood sugar mean | steroid injection and zfQ blood sugar in non diabetics | fasting blood sugar levels 8Uf on keto diet | does vitamin c gEJ raise blood sugar | how do Qw1 you check a cats blood sugar | pet wellbeing SLO blood sugar gold | can buspar raise your ksU blood sugar | can beetroot increase blood sugar lcO | blood sugar 153 i1V directly after meal | how high a blood sugar 0gg is dangerous | does coffee raise blood sugar ddA level | sleep apnea effect UbU on blood sugar | foods with high blood OMW sugar levels | blood sugar 1sE test price in india | blood sugar of LWi 400 after meal | how 14m to test your dog blood sugar | 700 blood sugar official | post prandial blood sugar 86F | how soon after e7S eating should i test blood sugar | how to control eBL blood sugar and cholesterol | post prandial blood sugar KIT normal range canada | what food makes blood sugar Bjo go down | cbd oil help blood zbh sugar | OCO is 210 blood sugar bad | 6ke blood sugar diet green tea smoothie | blood sugar 40s 2 hours after dwY eating | what are considered IOx low blood sugar levels | normal fasting blood sugar level 4ON india | can you have high Gi1 and low blood sugar | can low blood 4Hi sugar make blood pressure to elevate | what does a blood sugar ura test show | blood sugar of 3NO 150 during pregnancy | what uMH time of day should i test my blood sugar | i cant keep my blood sugar TTQ stable | blood pressure h8P and sugar app download | normal 8d8 blood sugar but ketones in urine | how does excessive weight loss and high blood sugar fBX affect | jLj blood sugar level 60 means | taking insulin Tyk with low blood sugar | Jwq blood sugar levels of untreated diabetes | normal nighttime blood sugar levels v4F for hypoglycemics | normal 6n9 blood sugar level in child | blood sugar measuring mkf instrument price in india | average blood qQl sugar levels while pregnant | blood sugar LL9 levels after eating in pregnancy | TSS low blood sugar sympotm | diabetes for low blood BUd sugar | can you die from high blood sugar tMC