– పొంగి ప్రవహిస్తున్న వాగులు, కుంటలు
– పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో పంట లు పూర్తిగా నీటి మునిగాయి. ప్రధానంగా పత్తి, మొక్కజొ న్న తదితర పంటలతో పాటు కూరగాయల పంటలు నీటిమనగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండలంతో పాటు నవాబుపేట, మోమిన్‌పే ట, మర్పల్లి, ధారూర్, పూడూర్, కోటిపల్లి, బం ట్వారం మండలాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురి సింది. పరిగిలోని సిద్ధమ్మ గుడి తండాలో ఇల్లు కూలింది. భారీ వర్షంతో వికారాబాద్ పట్టణంతోపాటు మండల కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. భారీగా వర్షం కురు స్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. అక్కడక్కడ రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో మో స్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. మరో మూడురోజులపాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరించారు.