నవతెలంగాణ-శంషాబాద్
ఈ నెల 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శాంతి భద్రతల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా సందర్శకుల పాసులను నిలిపివేశారు. సీఐఎస్ఎఫ్ డాగ్స్ స్కాడ్, బాంబుస్కాడ్, క్లూస్ టీంలతో అణువణువునా తనిఖీలు చేపట్టారు. పార్కింగ్, వాహనాల రద్దీ, తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఏయిర్పోర్టులోకి వచ్చే వాహనాల రాకపోకలపై మరింతా నిఘా పెంచారు. హై అలర్ట్తో సందర్శకులు ఎవరు కూడా ఎయిర్పోర్టుకు రావొద్దని అధికారులు తెలిపారు.